హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బరువు తగ్గాలంటే ఇదే బెస్ట్ రూట్!

స్థిరంగా బరువు తగ్గాలంటే సమతుల ఆహారంతో పాటు వ్యాయామం తప్పనిసరని హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ(NIN) స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మందిపై జరిగిన 2,332 క్లినికల్ ట్రయల్స్‌ను విశ్లేషించి 'అంబ్రెల్లా రివ్యూ' పేరిట ఓ నివేదికను రూపొందించింది. కేవలం డైట్‌తో కాకుండా, వర్కవుట్స్ కూడా చేస్తేనే ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు.