హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఆరెంజ్ అలర్ట్..!

VKB: జిల్లాలో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా పయనించి విదర్భ వద్ద బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు వర్షాలు, ఉరుములు, 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.