హైదరాబాద్: 28°C
తెలంగాణ

దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయం

NGKL: ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో లేకపోవడంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. కేవలం 30 రోజుల్లోనే 65 TMC నీరు తగ్గిపోవడంతో సోమశిల తీరంలోని సంగమేశ్వర ఆలయ శిఖరం దర్శనమిచ్చింది. సాధారణంగా ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చిలో బయటపడాల్సిన ఆలయం, వర్షాభావ పరిస్థితుల వల్ల జలాశయం నీటిమట్టం 864 అడుగులకు చేరడంతో ముందే బయటపడింది.