ప్రకాశం: దోర్నాలలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ఓ బైక్ తగలపడింది. ఓ యువకుడు మద్యం మత్తులో తన బైక్‌కు తానే నిప్పంటించినట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
మద్యం మత్తులో సొంత బైక్‌కు నిప్పు పెట్టుకున్నాడు!


