సత్యసాయి: కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ హోంగార్డు గంగిరెడ్డి నిజాయితీ చాటుకున్నారు. పర్సు పోగొట్టుకున్న రెవెన్యూ కాలనీకి చెందిన జై శ్రీరాములుకు రూ.8,600 నగదు, ఆధార్ కార్డు, విలువైన పత్రాలను అప్పగించారు. రోడ్డుపై దొరికిన పర్సును గంగిరెడ్డి వెంటనే ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పర్సు యజమానిని స్టేషన్‌కు పిలిపించి సురక్షితంగా అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
నిజాయితీ చాటుకున్న హోంగార్డు


