ASR: జిల్లాలోని చింతపల్లి (M) తాజంగి పరిధిలోని బోయపాడు వద్ద గెడ్డపై వంతెన లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడినప్పుడు లోతుగెడ్డ జంక్షన్ నుంచి వనజాజుల, బోయపాడు గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తున్నాయి. దీంతో గ్రామస్థులే చొరవ తీసుకుని వర్షంలోనూ కర్రలతో తాత్కాలిక వంతెన నిర్మించారు. తమ సమస్యను పరిష్కరించాలని అధికారులను వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వంతెనను నిర్మించుకున్న గిరిజనులు


