HNK: హన్మకొండ పట్టణంలోని భీమారం 55వ డివిజన్ భద్రకాళినగర్ రోడ్డు నంబర్-2లో శ్రీనివాస్ ఇంటి ఆవరణలో పెంచిన కందగడ్డ వినాయకుడి ఆకారంలో పెరగడం స్థానికులను ఆకట్టుకుంది. వినాయక చవితి సమీపిస్తున్న వేళ ఇలా గణపతి రూపంలో కనిపించడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కందగడ్డను ఆసక్తిగా తిలకించారు.
తెలంగాణ
కందగడ్డలో వినాయకుడి ఆకారం.. భక్తుల ఆసక్తి


