హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కొత్త పోస్ట్ బాక్స్‌ను ఏర్పాటు చేయండి'

WNP: చాలా సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన తపాలా బాక్సు వినియోగించడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉంది. పానగల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తపాలా బాక్సు తుప్పు పట్టింది. దీంతో నేరుగా తపాలా అధికారులను సంప్రదించి ఉత్తరాలను చేతికి అందజేయాల్సిన దుస్థితి నెలకొందని గ్రామపంచాయతీ అధికారులు వాపోతున్నారు. కొత్త పోస్ట్ బాక్స్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.