హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లవాగు కాలువలో పూడికతీత పనులు

SRD: కల్హేర్ మండలం కృష్ణాపూర్ పరిసర ప్రాంతాల్లోని నల్లవాగు పంట కాలువలో పూడికతీత పనులను అధికారులు చేపట్టారు. మండలంలోని ఇందిరానగర్ చివరి ఆయకట్టు వరకు నీరందకపోవడంతో కల్హేర్ తాహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ఇరిగేషన్ అధికారులు కాల్వలో పేరుకుపోయిన పూడికనంతా తొలగించి చివరి ఆయకట్టు వరకు నీరు పారుదల అయ్యేల చర్యలు తీసుకున్నారు.