హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

AKP: జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. తన నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ప్రతిమలను అందజేశారు. మట్టి గణపతులను పూజించి ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి సూచించారు. పర్యావరణ హితమైన వేడుకలకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.