హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైవర్ ప్రాణాలు తీసిన అద్దాలు..!

గుంటూరు నాయుడుపేటలో జరిగిన ప్రమాదంలో విజయవాడ రాణిగారితోటకు చెందిన లారీ డ్రైవర్ రాజేశ్ (33) మృతి చెందాడు. అద్దాల లోడుతో వచ్చిన రాజేశ్ వాటిని తాడుతో భవనం పైకి ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తు అద్దాలు జారి అతడిపై పడ్డాయి. తీవ్ర గాయాలతో రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.