హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ కోతలతో ఆక్వా రైతుల అవస్థలు

W.G: ఎల్‌నినో ప్రభావం, ప్రతికూల వాతావరణంతో రొయ్యల చెరువుల్లో వ్యాధుల వ్యాప్తి పెరిగింది. ఆక్సిజన్ స్థాయిని నిలబెట్టేందుకు ఏరియేటర్లు నిరంతరం నడపాల్సి ఉండగా, అప్రకటిత విద్యుత్ కోతలు ఆక్వా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 80 వేల ఎకరాల్లో సాగు సాగుతోంది. జనరేటర్లు, డీజిల్‌ ఖర్చులు అదనపు భారంగా మారాయి.