NRML: భైంసా మండలంలోని వాడి గ్రామ ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో గ్రామస్థులు నిరసనకు దిగారు. రోడ్డుపైనే మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఏళ్లుగా రహదారి పరిస్థితి దారుణంగా ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల సమయంలో గుంతల్లో నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వెంటనే తారు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రోడ్డు నిర్మాణం చేపట్టాలని..!


