హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగుల బీభత్సం.. ఇద్దరు మహిళలు మృతి

పల్నాడు: నరసరావుపేట(M) పెట్లూరివారిపాలెం, లక్ష్మీపురంలో కురిసిన భారీ వర్షానికి పిడుగులు పడ్డాయి. పెద్ద శబ్దాలకు భయాందోళనకు గురై ఇద్దరు మహిళలు మృతి చెందినట్లు సమాచారం. వేప, కొబ్బరి చెట్లపై పిడుగులు పడగా.. వేప చెట్టు రెండు ఆటోలపై కూలడంతో అవి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.