హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్షం వచ్చినా.. రాకపోయినా.. ట్రాఫిక్ నరకమే..!

గుంటూరు మూడు వంతెనల వద్ద రోజురోజుకీ ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణంతో రాకపోకలన్నీ మూడు వంతెనల కిందుగా సాగుతున్నాయి. ఇవే ప్రధాన మార్గాలు కావడంతో ప్రత్యామ్నాయం లేక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. శనివారం వర్షంతో వంతెనల కింద భారీగా నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. సాధారణ సమయంలో కూడా ట్రాఫిక్ నిలిచిపోతోందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు.