హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

SDPT: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారు విశేష అలంకరణలో దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చారు. అత్యంత ప్రాశస్త్యమైన ఈ రోజున వేదపండితులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకుని, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికారుల ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్ల చేశారు.