SKLM: టెక్కలి మండల కేంద్రంలో ఉన్న స్థానిక సాయి కృష్ణ యోగా కేంద్రంలో ఈనెల 15 నుంచి 30 వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు యోగా గురువు గేదెల చంద్రశేఖరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7గంటల వరకు యోగా శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానికులు వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల15 నుంచి ఉచిత యోగా శిక్షణ


