KMR: గాంధారి మండలం నేరెళ్ల తండాకు చెందిన కవిత అనే గర్భిణికి ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో 108 సిబ్బంది సత్యం, పైలెట్ గోవర్ధన్‌రావు చాకచక్యంగా వ్యవహరించి అంబులెన్స్‌లోనే సుఖ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు.
తెలంగాణ
అంబులెన్స్‌లో సుఖ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం


