TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. వేదపండితులు, అర్చకులు రేపు భూమి పూజ చేసి, పుట్టమట్టిని సేకరించి యాగశాలలో నవధాన్యాలు పోసి అంకురార్పణ చేయనున్నారు. ఈ నెల 15 నుంచి ఈ నెల 23వరకు ఉత్సవాలు ఘనంగా సాగనున్నాయి. 19న గరుడ సేవ, 20న స్వర్ణ రథోత్సవం, 23న చక్ర స్నానం ఉంటాయి. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 15-23 మధ్య ఆర్జిత సేవలను, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారికి బ్రహ్మోత్సవ శోభ.. రేపు అంకురార్పణ


