హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పర్యావరణహిత వినాయక విగ్రహాలపై అవగాహన'

TPT: వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు తిరుపతి మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ, ఏపీపీసీబీ రీజినల్ ఆఫీసర్ ఎం.బి.ఎస్.శంకరరావు ఆధ్వర్యంలో తిరుపతిలో పాంప్లెట్లు, పోస్టర్ ఆవిష్కరించారు. పర్యావరణహిత మట్టి విగ్రహాలను వినియోగించాలని, రసాయన రంగులకు దూరంగా ఉండాలని సూచించారు. జలవనరులను కాపాడుట దీని ముఖ్య ఉద్దేశమన్నారు.