VZM: గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం బోడ సింగిపేట గ్రామం పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీ రహదారి బురదమయం కావడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. కొద్దిపాటి కురిసిన వర్షానికి రహదారి గోతులతో బురదమయం కావడంతో నడవడానికి వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారిని సిమెంట్ రహదారిగా మార్పు చేసి కష్టాలను తీర్చాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
లక్ష్మీ నగర్ కాలనీవాసులకు నరకయాతన


