SRPT: కోదాడ మండల పరిధిలోని దొరకుంట గ్రామ శివారులో ఉన్న ఆర్.కే మేజర్ కాలువకు గ్రామస్థులు చెరువు నింపేందుకు కాలువకు శనివారం గండి కొట్టారు. దీంతో కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం, రెడ్లకుంట గ్రామస్థులు అక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు.దొరకుంట రైతులతో నల్లబండగూడెం, రెడ్లకుంట గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు.
తెలంగాణ
దొరకుంటలో రైతుల ఆందోళన!


