హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

NMS పరీక్షకు దరఖాస్తులు ప్రారంభం

కృష్ణా: ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు NMS స్కాలర్‌షిప్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు అవనిగడ్డ ప్రభుత్వ పరీక్షల కార్యాలయ సంచాలకులు KVN రెడ్డి తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలలోపు ఉన్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. అర్హులైన వారు అక్టోబర్‌ 12లోగా www.bse.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.