MHBD: గూడూరు మండలంలోని పడమటి తండా పంచాయతీ కొక్య తండాకు చెందిన భూక్య దేవ్లా ఎద్దు విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. శనివారం భారీ వర్షాలకు విద్యుత్ తీగలు తెగి ఎద్దుపై పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వ్యవసాయ పనులకు ఉపయోగపడే ఎద్దు మృతి చెందడంతో రైతు కుటుంబం కన్నీరుమున్నీరైంది. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి


