హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈత సరదా.. ఇద్దరు విద్యార్థులు మృతి!

SRPT: సెలవు రోజు స్నేహితులతో సరదాగా గడపాలనుకున్న ఆ బాలురకు అదే రోజు చివరి రోజుగా మారింది. ఈత సరదా ఇద్దరు నిండు ప్రాణాలను బలిగొంది. మునగాల మండలం ముకుందపురం గ్రామంలోని ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌లో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు 9వ తరగతి విద్యార్థులు గల్లంతై మృతి చెందారు. ఈ విషాద ఘటనతో ముకుందపురం, కోదాడ పరిసరాల్లో తీవ్ర విషాదం నెలకొంది.