KDP: చక్రాయపేట మండలం రెడ్డివారిపల్లి గ్రామం మాలపల్లిలో ఈ నెల 8న జరిగిన గొంగటి రాధ హత్య కేసులో ఆమె భర్త గొంగటి నాగార్జునను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నం నాగార్జునను అదుపులోకి తీసుకున్నట్లు ఆర్కే వ్యాలీ సీఐ శంకరరెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన రాయి, కట్టెను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్


