హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రధాన రహదారి అధ్వానం.. వాహనదారుల అవస్థలు

HNK: హన్మకొండ నగరంలో వెయ్యి స్తంభాల గుడి నుంచి చౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారి తారు లేచిపోయి కంకర తేలడంతో ప్రమాదకరంగా మారింది. పలుమార్లు గుంతలను పూడ్చినా కొద్దిరోజులకే తిరిగి అదే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.