MHBD: గూడూరు మండలం సీతానగరం గ్రామం కొమ్ములవంచ శివారులోని దట్టమైన అడవిలో ఉన్న భీముని పాదం జలపాతం వర్షాలతో జాలువారుతోంది. శనివారం కురిసిన వర్షానికి ఎగువ నుంచి వరద నీరు రావడంతో జలపాతంలో నీటి ఉద్ధృతి పెరిగింది. ఆదివారం, సోమవారం సెలవులు కావడంతో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ
జాలువారుతున్న భీముని పాదం జలపాతం


