హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థినుల ఘటనపై అధికారుల ఆరా

BDK: సారపాక రెసిడెన్షియల్ బాలికల కళాశాల వసతిగృహంలో విద్యార్థినులపై ఎలుకలు కరిచినా ఘటనపై అధికారులు స్పందించారు. ఖమ్మం RLC అరుణకుమారి, విజిలెన్స్‌ బృందం ఈ రోజు వసతిగృహాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.ఈ నెల 3,6,8 తేదీల్లో మొత్తం ఆరుగురు విద్యార్థినులను ఎలుకలు కరిచినట్లు గుర్తించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి నివారణ చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.