హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

TTD ట్రస్టులకు రూ. కోటి విరాళం

TPT: బెంగళూరుకు చెందిన భక్తుడు గిరియప్ప దయానంద టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కులను అందజేశారు. అనంతరం దాతను వెంకయ్య అభినందించారు.