హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దర్భ చాప సిద్ధం

TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీశాఖ అధికారులు శనివారం ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. జేఈఓ డాక్టర్ శరత్, డీఎఫ్ఓ ఆధ్వర్యంలో వీటిని రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై ఉంచారు. 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు, 200 కిలోల బరువున్న చాప, 250 మీటర్ల పొడవు, 100 కిలోల బరువున్న తాడును సిద్ధం చేశారు.