హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎడతెరిపి లేని వర్షాలు.. నిలిచిన ఉత్పత్తి

MNCL: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాంపూర్ ఏరియాలోని రెండు ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. శ్రీరాంపూర్ ఓసీపీలో రెండు రోజుల్లో 20 వేల టన్నులు నష్టం ఏర్పడింది. దీంతోపాటు రోజువారీగా 80 వేల క్యూబిక్ మీటర్ల ఓబీ తీయాల్సి ఉండగా వర్షంతో ఓబీ నిలిచిపోయింది. వర్షం కారణంగా 20 వేల క్యూబిక్ మీటర్ల ఓబీ నిలిచిపోయింది.