హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతి నిలయంలో ‘యుగావతార్’ ప్రదర్శన

సత్యసాయి: తెలంగాణ సంగారెడ్డి జిల్లా భక్తులు ప్రశాంతి నిలయంలో రెండు రోజుల పార్తి యాత్ర నిర్వహించారు. భగవాన్ శ్రీసత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాల వేళ సాయి యువత శ్రీ సత్యసాయి చాలీసా పారాయణం చేశారు. సమిష్టి సేవా కార్యక్రమాలను జిల్లా అధ్యక్షుడు శంకరప్ప వివరించారు. అనంతరం సాయి యువత ‘యుగావతార్’ పేరిట ప్రదర్శించిన తెలుగు బుర్రకథ ఆకట్టుకుంది.