ASR: గిరిజన కళాకారులకు నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ నిన్నటితో విజయవంతంగా ముగిసింది. గిరిజన సాంస్కృతిక పరిశోధన, ITDA ఆధ్వర్యంలో అరకులో శిక్షణ ఇచ్చారు. లక్క, గాజుల తయారీ, సవర ఆర్ట్, టెర్రకోట, మట్టి, వెదురు హస్తకళల్లో శిక్షణ అందించారు. జేసీ శ్రీపూజ కేంద్రాలను సందర్శించారు. సంప్రదాయ కళలకు ఆధునిక రూపకల్పనతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజన కళాకారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ


