హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.20 వేల నగదు బహుమతి.. దరఖాస్తుల ఆహ్వానం

ATP: ‘రాయలసీమ కథా రచన పోటీలు’ నిర్వహిస్తున్నట్లు రాయలసీమ సాంస్కృతిక వేదిక సమన్వయకర్త డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి తెలిపారు. సీమ ఉద్యమనేత డా. ఎం.వి. రమణారెడ్డి స్మారకార్థం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు నవంబరు 10లోపు కథలు పంపాలి. ఎంపికైన కథలకు రూ.20 వేల నగదు బహుమతి అందిస్తారు. వివరాలకు 9963917187ను సంప్రదించాలి.