హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జోరుగా సాగుతున్న 'ఫారం పాండ్' నిర్మాణ పనులు

NGKL: కొడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో ఫారం పాండ్ (పంట కుంటల) నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. చిన్న, సన్నకారు రైతులు పొలాల్లో వీటిని తవ్వించడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి, పంటలకు సాగునీటి ఎద్దడి తప్పుతుందని సర్పంచ్ పరశురాముడు, ఫీల్డ్ అసిస్టెంట్ మషన్న తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.