హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: కలెక్టర్

KMM: అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌ అధికారులను ఆదేశించారు. శనివారం బోనకల్ మండలం లచ్చగూడెంలో రూ. 29 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.