హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'పోలీస్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'

ASF: ప్రతి పౌరుడు పోలీస్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని హెడ్ కానిస్టేబుల్ జాదవ్ ఉమేష్ సూచించారు. బెజ్జూర్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత చట్టాలపై ప్రజలకు వివరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.