హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లోక్ అదాలత్‌తో సమయం ఆదా అవుతుంది'

సంగారెడ్డి: జిల్లావ్యాప్తంగా శనివారం చేపట్టిన జాతీయ లోక్ అదాలత్‌లో 3,625 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. రాజీ మార్గంతో సమయం, వ్యయం ఆదా అవుతాయని పేర్కొన్నారు. కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని కేసుల పరిష్కారానికి కృషి చేశారు.