హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మద్యం సేవించేవారిపై పోలీసులు కొరడా

NTR: ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా శనివారం రాత్రి సత్యనారాయణపురం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అలంకార్ సెంటర్ వద్ద సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురు వాహనదారులను గుర్తించి వాహనాలను సీజ్ చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని పోలీసులు హెచ్చరించారు.