హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేడుకగా శ్రీనివాస కల్యాణోత్సవం

CTR: చిత్తూరు మెకానిక్ మైదానంలో శనివారం రాత్రి శ్రీనివాస కళ్యాణం ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. బెంగళూరుకు చెందిన పీఠాధిపతులు, ఇస్కాన్ గురువులు, వేద పండితులు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. దీనిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.