హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: బైరెడ్డిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 13న మిషన్ ఫర్ విజన్ ట్రస్టు, ఆరోగ్య సేవా సంస్థ సహకారంతో చెన్నై శంకర్ నేత్రాలయ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శ్రీనివాసులు తెలిపారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు, కంటి అద్దాల పంపిణీ ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు