హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్సవ సమితి అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి

KNR: హుజురాబాద్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉత్సవ సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సమితి అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని వీహెచ్‌పీ రాష్ట్ర సేవ ప్రముఖ్ రాజేందర్ రెడ్డి, రాష్ట్ర గోశాల సంపర్క్ ప్రముఖ్ రాధాకృష్ణారెడ్డి తెలిపారు.