హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినాయక మండపాలకు అనుమతులు'

SKLM: వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు కమిటీలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కేవీ. మహేశ్వరరెడ్డి సూచించారు. మండపాల వద్ద కమిటీ సభ్యులు నిద్రించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భారీ శబ్దాలు చేసే సౌండ్ సిస్టం వాడొద్దని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,946 మండపాలకు అనుమతి కోరగా 2,359 మండపాలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు.