హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ లోక్ అదాలత్.. 574 కేసులు పరిష్కారం

SRD: నారాయణఖేడ్ జూనియర్ సివిల్ కోర్టులో న్యాయమూర్తి హిమబిందు ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖేడ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పెండింగ్ కేసులను ఇరువర్గాల సమక్షంలో రాజీ కుదిర్చి ఏకంగా 574 కేసులను పరిష్కరించినట్లు కోర్టు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో సీఐలు వెంకటరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.