MNCL: జన్నారం మండలంలోని లోతరే పంచాయతీ పరిధిలోని ఆదివాసీలకు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారు. శనివారం మెడికల్ టీమ్ సభ్యులు ఉధృతంగా ప్రవహిస్తున్న కొత్తూరు పల్లె వాగును ప్రాణాలకు తెగించి దాటారు. లక్ష్మీపూర్ తండా గ్రామ ఆదివాసీల వద్దకు చేరుకుని పిల్లలు, గర్భిణులకు టీకాలు వేశారు. కష్టకాలంలో వాగులు దాటి వైద్యం అందించిన సిబ్బందిని ఆదివాసీలు అభినందించారు.
తెలంగాణ
గ్రేట్.. వాగులు దాటి వైద్యం..!


