SDPT: అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిద్ధిపేట రూరల్ మండలం దుద్దెడలో రైతన్నలు ధర్నాకు దిగారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో రైతులు రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రహదారిపై కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని కోరారు.
తెలంగాణ
దుద్దెడలో రైతన్నల ధర్నా


