హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వంతెనపై ప్రమాదకరంగా పెద్ద గుంత

ASF: సిర్పూర్ (టి) మండలం పారిగాం వంతెనపై పెద్ద గుంత ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలో వర్షపు నీరు చేరి ప్రమాదకరంగా మారింది. రాత్రివేళల్లో గుంతలు కనిపించక వాహనాలు అదుపుతప్పే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గుంతను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.