హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు: ఎస్పీ

MDK: జిల్లా కేంద్రంలో గణేష్ ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మెదక్ టౌన్, రూరల్ సర్కిళ్ల పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులు, కమిటీ సభ్యులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్సవాల నిర్వహణకు పోలీసులు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశారన్నారు.