JN: పట్టణంలోని ధర్మకంచ ఎస్సీ బాలికల వసతి గృహంలో శనివారం షీ టీం ఆధ్వర్యంలో మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికలకు మహిళా భద్రత, వేధింపుల నుంచి రక్షణ, అత్యవసర సమయాల్లో 112 కాల్ చేసి పోలీసులను సంప్రదించే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లలిత, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
హస్టల్‌లో షీ టీం అవగాహన కార్యక్రమం


